ఆశా వర్కర్లపై ఏపీ సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42,752 మంది ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు రూ. 10 వేల వేతనం పొందుతున్నారు. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద రూ. 1.5 లక్షలు పొందే అవకాశం ఉన్నది.
Previous Articleప్రాపంచిక దూరాలను తగ్గించడంలో సూఫీ సంప్రదాయాలు వారధి
Next Article ట్రంప్ ప్రతీకార సుంకాల వేళ భారత్, ఈయూ కీలక ప్రకటన
Keep Reading
Add A Comment