Andhra Pradesh

ఈ నెల 15న మచిలీపట్నంలో పని ఉందని బయటకు వెళ్లిన ఆయన.. తర్వాత కనిపించకుండా పోయారు. ఆయన ఫోన్‌ కూడా పని చేయలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 16వ తేదీన అందరూ జాగ్రత్త అంటూ భార్య ఫోన్‌కు మెసేజ్‌ పంపారు.

వైసీపీ హయాంలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్లు కూడా దారుణంగా పడిపోయాయన్నారు మంత్రి లోకేష్. నాడు-నేడులో లోపాలు ఉన్నాయని, అవినీతి ఉందని.. అన్నింటినీ తాము సరిచేస్తామన్నారు.

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

పవన్ కల్యాణ్ తో కలసి టీ తాగడం కోసం ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఆల్రడీ జరిగిందని, లోకేష్ తో కలసి అరకు కాఫీ తాగేవారితో మరో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్ట వచ్చని అన్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.

గత ప్రభుత్వ వైఫల్యాలకే పరిమితమైన గవర్నర్‌ ప్రసంగం.. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన కొత్త ప్రభుత్వం వారి ఆకాంక్షలు ఎలా నెరవేర్చుతుందనే విషయాన్నే ప్రస్తావించలేదని గుర్తుచేశారు.

ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడిగా దీన్ని ఎవరూ చూడటంలేదు. కొడాలి నాని మాజీ పీఏపై జరిగిన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. కొడాలి నాని పేరు హైలైట్ కావడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.

ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సహా టీడీపీ నేతలు.. అంతు చూస్తాం, పాదాలతో తొక్కేస్తాం అంటుంటే.. రాజకీయ కక్ష అనుకున్నామని, నిజంగానే వారు ఇంతటి హింసకు దిగజారుతారని అనుకోలేదన్నారు విజయసాయిరెడ్డి.

వినుకొండలో మైనార్టీ యువకుడు రషీద్‌ను నడిరోడ్డుపై నరికి చంపి రాక్షస పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుపరిపాలన అందించాలని ప్రజలు అధికారమిస్తే.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని సీతారాం మండిపడ్డారు.