Andhra Pradesh
అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి అరెస్టయితే, కులం అడ్డం పెట్టుకొని జాతిని మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో గౌడ బిడ్డలు లేరు.. అని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
ఢిల్లీ హైకోర్టు విజయసాయికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలంటూ మీడియా సంస్థల్ని ఆదేశించింది.
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. లేకపోతే ఈనెల 30న ఎన్నిక జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఓట్లు లెక్కిస్తారు.
చేసిన మంచి ఎక్కడికీ పోదని, వచ్చే ఎన్నికల్లో అదే మనకు శ్రీరామ రక్షలా ఉంటుందన్నారు జగన్
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పేమీ లేదని అన్నారు మాజీ మంత్రి జోగి. తమ కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే.. విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటామని తేల్చి చెప్పారు.
మంత్రిగా తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని జోగి రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని గతంలోనే టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి.
ఆడుదాం ఆంధ్రా విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈ అవినీతికి మాజీ మంత్రి రోజాని బాధ్యురాలిగా చేసే అవకాశాలున్నాయి. పక్కా ఆధారాలతో తమ ఆరోపణలను నిరూపించి రోజాపై విచారణ చేపట్టే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
సాగునీటి ప్రాజెక్ట్‌లపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు అంబటి. కాఫర్ డ్యాం లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానన్నారని గుర్తు చేశారు.
టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెడితే ఈనెల 30న పోలింగ్ జరుగుతుంది. బొత్స ఒక్కరే అభ్యర్థి అయితే మాత్రం ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.
వైసీపీ ఎంత సైలెంట్ గా ఉండాలనుకున్నా.. పదే పదే ఈ విషయంలో రెచ్చగొట్టి చివరకు అటు నుంచి ట్వీట్ పడేలా చేసింది టీడీపీ.