మేకప్ రిమూవర్ లేకుండానే.. మేకప్‌ తుడిచేయండిలా!

నిజానికి మనకి మేకప్ వేసుకునేటప్పుడు ఉన్నంత ఓపిక, శ్రద్ద తొలగించుకునేటప్పుడు ఉండదు. కానీ అది సరయిన పద్ధతి కాదని మేకప్ తొలగించడం కూడా చాలా ఓపికగా చేయాలని చెబుతున్నారు నిపుణులు.

Advertisement
Update:2024-06-13 16:24 IST

అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇక అందాన్ని రెట్టుంపు చేసుకోవాడానికి కాస్త అయినా మేకప్‌ వేసుకొని అమ్మాయే లేదు ఈ కాలంలో. మనల్ని రోజంతా అందంగా కనిపించేలా చేసినా రాత్రి పడుకునే ముందు మాత్రం మేకప్ పూర్తిగా తొలగించక తప్పదు. లేదంటే వివిధ రకాల చర్మ సౌందర్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేకప్ చర్మ రంధ్రాలలో పేరుకుపోయి వైట్ హెడ్స్, మొటిమలు, చర్మ పగుళ్లు ఏర్పడతాయి. మేకప్‌ను తొలగించడానికి చాలా మంది మార్కెట్‌లో దొరికే కెమికల్‌ మేకప్‌ రిమూవర్స్‌ వాడుతూ ఉంటారు. కానీ మనకు ఇంట్లో సహజంగా దొరికే వాటితోనూ మేకప్‌ను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి చర్మానికి ఎలాంటి హాని చేయవు.​

నిజానికి మనకి మేకప్ వేసుకునేటప్పుడు ఉన్నంత ఓపిక, శ్రద్ద తొలగించుకునేటప్పుడు ఉండదు. కానీ అది సరయిన పద్ధతి కాదని మేకప్ తొలగించడం కూడా చాలా ఓపికగా చేయాలని చెబుతున్నారు నిపుణులు. మాములుగా ఉండే మేకప్ తొలగించడం కంటే, వర్షంలో కూడా పోకుండా ఉండే వాటర్ ప్రూఫ్ మేకప్ తొలగించుకోవటం అయితే ఇంకా కష్టం. అయితే కొబ్బరి నూని ఇలాంటి వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ను ఎంతో సులువుగా తొలగించడమే కాకుండా చర్మానికి మాయిశ్చరైజర్‌లాగా పనిచేసి మృదువుగా మారుస్తుంది. స్మజ్ ప్రూఫ్ లిప్‌స్టిక్‌ను సైతం కొబ్బరినూనెతో ఇలాగే తొలగించుకోవచ్చు. కొబ్బరి నూనె మాదిరిగానే, బాదం నూనె కూడా సహజంగా మేకప్ తొలగించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నూనె చర్మాన్ని పొడిబారనివ్వకుండా తేమగా ఉంచుతుంది.

 

పచ్చి పాలు కూడా సౌందర్య పోషణలో చాలా ఉపయోగపడతాయి. ఇవి మేకప్‌ను తొలగించడానికి కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. పాలలో ఉన్న శక్తివంతమైన బ్లీచింగ్ లక్షణాలు మేకప్‌ను తొలగించడానికే కాదు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలోనూ తోడ్పడతాయి. బాదం పాలు కూడా ఇదే తరహాలో వాడవచ్చు.

ఇక తేనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి మంచి మాయిశ్చరైజర్‌లాగా పని చేస్తాయి. మేకప్‌ రిమూవర్‌గా తేనెను వాడాలి అనుకుంటే ఒక కాటన్‌ బాల్‌ లేదా తడిపిన కాటన్‌ క్లాత్‌పై కాస్త తేనె వేసి, దాంతో ముఖంపై మసాజ్‌ చేసినట్లుగా మృదువుగా 5 నిమిషాల పాటు రుద్దుకోవాలి. సాధారణ చర్మం అయితే తేనెలో బేకింగ్‌ సోడా, పొడి చర్మమైతే పాలు కలుపుకోవాలి.

 

కీరా జ్యూస్‌ కూడా న్యాచురల్‌ మేకప్‌ రిమూవర్‌లా పనిచేస్తుంది.కీరా జ్యూస్‌లో కొబ్బరి నూనె కలిపి వాడినప్పుడు అది మేకప్‌ను, మృతకణాలను ప్రభావవంతంగా తొలగిస్తుంది. అలాగే కలబంద గుజ్జు, కొద్దిగా తేనె, 4-5 చుక్కల బాదంనూనె మిశ్రమం వల్ల కూడా మేకప్‌ తొలగిపోవడంతో పాటు ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

Tags:    
Advertisement

Similar News