విశ్వసుందరిగా డెన్మార్క్‌ భామ

మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కించుకున్న విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌

Advertisement
Update:2024-11-17 13:27 IST

డెన్మార్క్‌ భామ విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌ విశ్వసుందరిగా నిలిచారు. మెక్సికో వేదికగా జరిగిన పోటీలో మిస్‌ యూనివర్స్‌ -2024 కిరీటం దక్కించుకున్నారు. 125 దేశాలకు చెందిన యువతులు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడగా 21 ఏళ్ల విక్టోరియా విజేతగా నిలిచారు. డెన్మార్క్‌ నుంచి విశ్వసుందరి టైటిల్‌ సొంతం చేసుకున్న మొట్టమొదటి యువతి విక్టోరియా కేజర్‌ కావడం గమనార్హం. నైజిరియాకు చుందిన చిడిమ్మ అడెట్షినా, మెక్సికో కు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌డ్రాన్‌ రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. మిస్‌ యూనివర్స్‌ -2023 షెన్నిస్‌ పలాసియోస్‌ ఈ ఏడాది విజేత విక్టోరియా కెజార్‌ కు కిరీటం అందజేశారు. 2004 సంవత్సరంలో పుట్టిన విక్టోరియా కెజార్‌ బిజెనెస్‌ అండ్‌ మార్కెటింగ్‌ లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. డ్యాన్స్‌ లోనూ ఆమె శిక్షణ పొందారు. బిజినెస్‌ లో స్థిరపడ్డారు. మెంటల్‌ హెల్త్‌, మూగజీవాల సంరక్షణ లాంటి అంశాల్లో ఆమె పని చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News