తెలంగాణ తల్లికి అమరజ్యోతే నిలువెత్తు సాక్షి

2023లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం : మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-12-10 15:20 IST

తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆవిష్కరించుకున్నామని చెప్పడానికి సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరజ్యోతే నిలువెత్తు సాక్ష్యమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. అమరజ్యోతి ఎదుట ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంతో కూడిన ఫొటోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ''అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. తెలంగాణ తల్లి దీవెనలతో నా రాష్ట్రం పసిడి తెలంగాణగా విరాజిల్లాలని కేసీఆర్‌.. జూన్ 22, 2023 నాడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. కేసీఆర్‌ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా అవిష్కరించలేదు అని అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు హుస్సేన్ సాగర తీరాన అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంగణంలో కొలువుదీరిన పసిడి వర్ణంతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహమే నిలువెత్తు సాక్ష్యం..'' అని వివరించారు.

Tags:    
Advertisement

Similar News