తెలంగాణ భవన్‌ లో సావిత్రి భాయి ఫూలేకు నివాళులు

పాల్గొన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, నాయకులు

Advertisement
Update:2025-01-03 14:54 IST

సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌ లో ఆమె చిత్రపటానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు మధుసూదనాచారి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌ రెడ్డితో కలిసి సావిత్రి భాయి ఫూలేకు నివాళులర్పించారు. ఆమె గొప్ప అభ్యదయవాది అని, స్త్రీలకు విద్య, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరిడిన ధీర వనిత అని కొనియాడారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కోతి కిశోర్ గౌడ్, తుంగబాలు, గాంధీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




 


Advertisement

Similar News