రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఇలియానా రెండోసారి తల్లి కాబోతోంది.
ప్రముఖ హీరోయిన్ ఇలియానా రెండోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా న్యూఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో ద్వారా ఆమె తెలియజేసింది. ఆ వీడియోలో... 2024 ప్రేమ, శాంతితో గడిచిపోయిందని ఆమె వెల్లడించింది. తన కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్, భర్త మైఖేల్‌తో గడిపిన క్షణాలను వీడియో ద్వారా ఇలియానా పంచుకున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్‌లో తాను గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. కాగా, 2023 ఆగస్టులో ఇలియానా కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ... ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాగా ఇలియానా ప్రియుడు మైఖేల్ డోలన్‌ను పెళ్లాడింది.
కొన్నాళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్ పూర్తి ఫొటోను షేర్ చేసింది. సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. పస్ట్ మూవీ దేవదాసుతో అందరికీ తెగ నచ్చేసింది. పోకిరి, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్.. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్‌గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్‌లో బర్ఫీ మూవీ ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో అందులో నటించింది. ఆ వెంటనే హిందీలోనే వరుస చిత్రాలు చేసింది.