జగనే మళ్లీ సీఎం.. ల్యాండ్‌ టైటిలింగ్‌తో లాభం ఇదే - కేసీఆర్

తెలంగాణలో తమ ప్రభుత్వం తెచ్చిన ధరణితో చాలా మేలు జరిగిందన్నారు. ధరణి వచ్చిన తర్వాత ఒకరి భూమిని మరొకరు టచ్‌ చేసే అధికారం లేదన్నారు.

Advertisement
Update:2024-05-10 12:56 IST

ఏపీలో చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌పై స్పందించారు బీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్. గత ప్రభుత్వాలు భూమిని చిక్కుల్లో పెట్టి, రైతులను రాచిరంపాన పెట్టాయన్నారు. గతంలో భూమి ఎవరిదో కన్ఫ్యూజన్‌లో పెట్టి లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు సాక్షి న్యూస్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు కేసీఆర్.

తెలంగాణలో తమ ప్రభుత్వం తెచ్చిన ధరణితో చాలా మేలు జరిగిందన్నారు. ధరణి వచ్చిన తర్వాత ఒకరి భూమిని మరొకరు టచ్‌ చేసే అధికారం లేదన్నారు. రైతు వెళ్లి వేలి ముద్ర వేస్తే తప్ప ల్యాండ్ టైటిల్ మారదన్నారు. భూములు ఇతరులు లాక్కోకుండా ఉండడానికే ల్యాండ్ టైటిల్ అన్నారు కేసీఆర్. తెలంగాణలోనూ ధరణిపై బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేశాయన్నారు.

ఏపీలో మరోసారి జగన్‌ అధికారంలోకి వస్తారని అన్నారు కేసీఆర్. రెండోసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్ సీఎం అవుతారన్న సమాచారం తనకు ఉందన్నారు. ఇటీవల టీవీ-9కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఇదే మాట చెప్పారు కేసీఆర్.

Tags:    
Advertisement

Similar News