తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేస్తా : సీఎం రేవంత్‌రెడ్డి

ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Advertisement
Update:2024-11-19 18:21 IST

తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేస్తా అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఓరుగల్లును అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని ముఖ్యమంత్రి అన్నారు. వరంగల్‌ జిల్లా మంత్రి, ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టుబట్టి అభివృద్ధి పనులను సాధించుకున్నారని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో నాలుగైదు విమానాశ్రయాలు ఉన్నాయని.. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఒకేఒక ఎయిర్‌పోర్టు ఉందన్నారు. తెలంగాణలో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండంలో కొత్తగా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాస్తామని సీఎం తెలిపారు.

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ కనీసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటైనా నగరంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘‘వరంగల్‌ గడ్డ నుంచి రైతులందరికీ మరోసారి మాట ఇస్తున్నా. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రూ.2లక్షలలోపు రుణమాఫీ వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News