కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు
ఖమ్మంలో మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Advertisement
కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం చిన్న వెంకటగిరిలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా -ఈ రేసులో కేబినెట్ అప్రూవల్ లేకుండానే విదేశాలకు రూ.55 కోట్లు మళ్లించారని, ఈ కేసులో ఏసీబీ అరెస్ట్ చేస్తుందనే భయంతోనే ఢిల్లీకి వెళ్లారా అని ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి ఈ కేసు నుంచి తనను తప్పించాలని ప్రాధేయపడేందుకే ఢిల్లీకి వెళ్లారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమ ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. తాను పేల్చబోయే బాంబు ఏంటో కేటీఆర్ కు తెలుసు అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని వెలికితీస్తే అంతరిక్షంలోకి వెళ్లి దాక్కునేలా ఉన్నారని అన్నారు.
Advertisement