డిసెంబర్‌ ఆఖరిలోపు రుణమాఫీ చేస్తాం

రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, పంటలకు మద్దతు ధర ఇస్తామన్న మంత్రి పొంగులేటి

Advertisement
Update:2024-11-09 17:55 IST

రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, పంటలకు మద్దతు ధర ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. డిసెంబర్‌ ఆఖరిలోపు పెండింగ్ లో రూ. 13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. డిసెంబర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ. రెండు లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌ నిత్యం చెబుతున్నారు. మొన్న ప్రధాని ట్వీట్‌కు కూడా సీఎం స్పందిస్తూ రుణమాఫీ చేశామని చెప్పారు. కానీ ఇంకా పెండింగ్‌లో రూ. 13 వేల కోట్లు డిసెంబర్‌ ఆఖరిలోపు చెల్లిస్తామని రెవెన్యూ మంత్రి అనడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. రేవంత్‌ ప్రభుత్వంలో రుణమాఫీపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ చేయకుండా విపక్షనేత హరీశ్‌ను రాజీనామా చేయాలని అడిగే హక్కు సీఎం రేవంత్‌కు గాని, ఆపార్టీ నేతలకు ఎక్కడిదని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News