సంక్రాంతికి ఊరికి వెళ్తున్నాం..మా ఇంటికి రాకండి ఓనర్ లేఖ వైరల్
పండగకు ఊరెళ్తుమని డోర్‌పై ఇంటి యజమాని రాసిన నోట్ నెట్టింట వైరల్ అవుతుంది
Advertisement
సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లూ ఓ ఇంటి యాజమాని రాసిన నోట్ నెట్టింగ వైరల్ అవుతుంది.మేము పండుగకి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ పేపర్‌పై రాసి ఓ ఇంటి యజమాని డోర్‌కు అంటించి మరీ వెళ్లాడు.
ఈ విషయం సోషల్ మీడియా కంట పడగా.. వైరల్‌గా మారింది. సహజంగా పండగల వేళ నగరాల నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటూరు. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. ఇలాంటి దొంగలకే షాక్ ఇస్తూ ఓ ఇంటి ఓనర్ ఈ విధంగా రాసి తలుపుకు అతికించడం అందరినీ ఆకర్షించింది. ఈయనెవరో దొంగలకే లెటర్ రాశారంటూ.. పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Advertisement