జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం పరిశీలన

రేషన్‌ కార్డు ఉన్నచోటే స్థలం ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు చెప్పిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌;

Advertisement
Update:2025-03-12 13:24 IST

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తారు. కొణతాల రామకృష్ణ, కాలువ శ్రీనివాసులు ప్రశ్నలు అడిగారు. వీరికి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సమాధానాలు ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదన్నారు. రేషన్‌ కార్డు ఉన్నచోటే స్థలం ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ అధ్యయనం చేస్తున్నదని పేర్కొన్నారు. కమిటీ ఈ అంశంపై ప్రతిపాదనలు చేస్తున్నదన్నారు. జర్నలిస్టులకు తక్కువ ధరకే స్థలాలు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. వీటిని ఎలా ఇవ్వాలనే అంశంపై సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ జర్నలిస్టులను కూడా మోసం చేసింది. వారిపై భారం మోపేలా ఇళ్ల పట్టాల జీవోను ఇచ్చిందని మంత్రి అన్నారు.

Tags:    
Advertisement

Similar News