తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మందుల శామ్యూల్
తుంగతుర్తి టికెట్ రేసులో చాలా మంది ఆశావహులు ఉన్నారు. గత రెండు పర్యాయాలు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన అద్దంకి దయాకర్ ఈ సారి కూడా తనదే టికెట్ అన్న ధీమాతో ఉన్నారు.
కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుంగతుర్తి, సూర్యాపేట ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు సీట్లు ఎవరికీ దక్కుతాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే అందరి అంచనాలకు మించి తుంగతుర్తి టికెట్ మందుల శామ్యూల్‌కు కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది.
మందుల శామ్యూల్ జూన్‌లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ నుంచి తుంగతుర్తి టికెట్ ఆశించిన శామ్యూల్.. సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ కన్ఫామ్ చేయడంతో గులాబీ పార్టీని వీడారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక తుంగతుర్తి టికెట్ రేసులో చాలా మంది ఆశావహులు ఉన్నారు. గత రెండు పర్యాయాలు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన అద్దంకి దయాకర్ ఈ సారి కూడా తనదే టికెట్ అన్న ధీమాతో ఉన్నారు. అందుకోసం ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి, పిడమర్తి రవి సైతం తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నారు.