తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగో వచ్చేసింది. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం కొత్త లోగోను విడుదల చేశారు. లోగోలో భారత రాజముద్ర మూడు సింహాల గుర్తు.. కింద బస్సు చక్రం.. దానికి రెండు వైపులా వరి కంకులు.. మధ్యలో ఇంగ్లిష్‌లో తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ను ఇండికేట్ చేస్తూ 'టీజీటీడీ' లెటర్స్.. రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ అనే సందేశంతో ఈ లోగోను తీసుకువచ్చారు. లోగోలో తెలంగాణను ఇండికేట్ చేసే ప్రత్యేక చిత్రాలేవి లేవు.
Advertisement