హైదరాబాద్‌లో కుండపోత వర్షం
హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా భారీ వర్షం దంచికొడుతోంది.దీంతో ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ఎండలు మండిపోయాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట,ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, ప్యారడైస్, నాంపల్లి, అసెంబ్లీ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి, నారాయణగూడ, హిమాయత్ నగర్ శేరిలింగంపల్లి, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లిలో భారీ వర్షం కొడుతోంది.
దీంతో ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరద నీరు రోడ్లుపైకి చేరడంతో ఇళ్లకు వెళ్లే సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఆ నీటిని నాలాల్లోకి మళ్లించాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.