కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం క్లారిటీ

తెలంగాణల్లో త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Advertisement
Update:2024-11-27 16:47 IST

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, ఆయా రాష్ట్రాల ఎలక్షల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా ఆయన చిట్ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేరళ, జార్ఖండ్ లో మెజారిటీ సాధించిందని తెలిపారు. మహారాష్ట్రలో కూడా లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు. కేరళ వయనాడ్ లో అత్యధిక మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలిచారని పేర్కొన్నారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకుంటున్నారని భట్టి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవుని క్యాబినేట్ విస్తరణపై పార్టీ హైమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ప్రతి నెల ఆర్టీసీకి రూ.400 కోట్ల వరకు సర్కార్ చెల్లిస్తుందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్ రూ.500 కే ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రైతు భరోసా పై కసరత్తు జరుగుతుందని.. 2లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.హైడ్రా, మూసీ విషయంలో ఆలోచన చేశాకే ముందుకు పోతున్నాం. మూసీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకునేందుకు రుణ సదుపాయం కల్పిస్తాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

Tags:    
Advertisement

Similar News