తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే
వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి
Advertisement
తెలంగాణలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఏప్రిల్ 29 నుంచి ఈఏపీసెట్ జరగనున్నది. ఏప్రిల్ 29,30 తేదీల్లో ఈఏపీసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) నిర్వహించనున్నారు. మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్, జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, జూన్ 8,9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.
Advertisement