గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్‌-2024 ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ఈవేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Advertisement
Update:2024-10-19 19:44 IST

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. జీవో మీద ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మొదట్లోనే చెబితే మార్చేవాళ్లమని అన్నారు. హాల్‌టిక్కెట్లు రిలీజ్ చేశాక పరీక్షలను ఆపడం కుదరదని తెలిపారు.హైదరాబాద్‌లోని రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్‌-2024 ముగింపు వేడుకలకు హాజరయ్యారు.

ముగింపు వేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీస్‌ డ్యూటీ మీట్‌ కావడంతో పోలీస్‌ అధికారులు నాలుగు రోజుల పాటు వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. 26 పోలీస్‌ విభాగాల నుంచి 13 బృందాలుగా ఏర్పడి పలు ఈవెంట్లు నిర్వహించారు. సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌, డాగ్‌ స్క్వాడ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, ఫొటో, వీడియోగ్రఫీ లాంటి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు రేవంత్ రెడ్డి ట్రోఫీలు అందజేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైబర్ క్రైమ్ సంబంధించిన హ్యాండ్‌బుక్‌ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.కాగా, విజేతలు వచ్చే జనవరిలో రాంచీలో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్‌ మీట్‌లో పాల్గొనున్నట్టు అధికారులు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News