తీన్మార్ మల్లన్న మనుషుల పనేనా..?
తనపై, తన మనుషులపై దాడికి వ్యతిరేకంగా నార్కట్‌పల్లి పీఎస్ ముందు అశోక్‌గౌడ్ ఆందోళనకు దిగారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని అశోక్ గౌడ్‌తో మాట్లాడారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, అశోకా అకాడమీ అధినేత అశోక్‌గౌడ్, ఆయన మనుషులపై దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలే తనపై, తన మనుషులపై దాడి చేశారని అశోక్‌గౌడ్ ఆరోపించారు. డోకూరు గార్డెన్‌లో కాంగ్రెస్ వాళ్లు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో తాము అక్కడికి వెళ్లామని.. డబ్బులు ఎందుకు పంచుతున్నారని అడిగినందుకు ఫోన్లు ధ్వంసం చేసి, తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా కనీసం పట్టించుకోలేదన్నారు.
తనపై, తన మనుషులపై దాడికి వ్యతిరేకంగా నార్కట్‌పల్లి పీఎస్ ముందు అశోక్‌గౌడ్ ఆందోళనకు దిగారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని అశోక్ గౌడ్‌తో మాట్లాడారు. ఆందోళన విరమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
పోలీసుల విజ్ఞప్తితో అశోక్‌గౌడ్ నిరసన విరమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్‌గౌడ్ ఫిర్యాదు నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌తో వ్యక్తిగత భద్రత కల్పించింది ప్రభుత్వం. ఎన్నికల తంతు పూర్తయ్యేవరకు భద్రత కొనసాగుతుందని తెలిపింది.