తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘాల నేతలు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ డీజీపీకి రెడ్డి సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.

Advertisement
Update:2025-02-04 17:07 IST

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి రెడ్డి సంఘాల నేతలు నేతలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 28న వరంగల్ వేదికగా బీసీ సభను తీన్మార్ మల్లన్న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెడ్డి కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, కుక్కలతో పోలుస్తూ దూషించారని ఆరోపణలు వస్తున్నాయి. మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి కులాన్ని కించపరిచేలా దూషించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News