సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జగ్గారెడ్డి
ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు.;
తాను త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. పాలిటిక్స్ నుంచి విశ్రాంతి తీసుకుని ‘ఏ వార్ ఆఫ్ లవ’ అనే ప్రేమ కథా చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఆ మూవీకి సంబంధించి పోస్టర్ కూడా విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రం రూపుదిద్దుంకుంటోందని తెలిపారు.
మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను షాక్‌కు గురయ్యాని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్‌లో ఉన్నాని తెలిపారు. నేనెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుందని సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను చెప్పారు. నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరని జగ్గారెడ్డి తెలిపారు.