వరద సాయ నిధులను విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణ‌కు అరకొర

తెలుగు రాష్ట్రాలతో సహా వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్ల నిధులను విడుదల చేసింది.

Advertisement
Update:2024-10-01 20:53 IST

వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం నిధులను విడుదల చేసింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరదలకు తీవ్రంగా నష్టపోయిన పలు రాష్ట్రాలకు రూ. 5,858.60 కోట్ల నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందులో తెలంగాణ‌కు రూ. 416.80 కోట్లు విడుద‌ల చేయ‌గా, ఏపీకి రూ. 1036 కోట్ల నిధుల‌ను కేంద్రం విడుద‌ల చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లను ఇచ్చింది. గుజరాత్‌కు రూ.600 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లను కేటాయించింది. రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్రం వాటాగా ఈ మేరకు నిధులను విడుదల చేసింది.

త్వరలోనే మహారాష్ట్రంలో శాసన సభ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆరాష్ట్ర‌కు భారీగా నిధులు విడుద‌ల చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ నిధుల వరద పారించడాటం మోదీ సర్కార్‌కి అనావాయితీ అని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీలు ఉండి ఇంత త‌క్కువ‌గా నిధులు విడుద‌ల చేయిస్తారా..? అని వ‌ర‌ద బాధితులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు

Tags:    
Advertisement

Similar News