2022-23 ఆర్థిక సర్వే: లాజిస్టిక్స్ డెవలప్‌మెంట్ లో టాప్ 5 లో తెలంగాణ
మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన సర్వే రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ప్రసూతి మరణాల రేటులో మూడో స్థానంలో ఉండటమే కాకుండా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మహిళా కార్మిక శక్తి వినియోగంలో నాల్గవ స్థానంలో నిలిచింది.
తాజా ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం లాజిస్టిక్స్ డెవలప్‌మెంట్ పరంగా దేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన సర్వే రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ప్రసూతి మరణాల రేటులో మూడో స్థానంలో ఉండటమే కాకుండా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మహిళా కార్మిక శక్తి వినియోగంలో నాల్గవ స్థానంలో నిలిచింది.
తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా తదితర 11 రాష్ట్రాలు 90 శాతానికి పైగా స్కోర్‌తో అచీవర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ప్రసూతి మరణాలు లక్ష మందిలో 70 కంటే తక్కువగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. జాతీయ సగటు 97 ఉండగా కేరళలో 19, మహారాష్ట్రలో 33, తెలంగాణలో 43, ఆంధ్రప్రదేశ్‌లో 45 ,తమిళనాడులో 54 ఉన్నాయి.
తెలంగాణలో, మొత్తం ఆరోగ్య వ్యయంలో వ్యక్తులు స్వంతంగా జేబులోంచి ఖర్చు చేయడం దేశంలోనే అత్యల్పంగా 48 శాతంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా వ్యక్తుల ఖర్చు 71.3 శాతం ఉంది. ఇంకా, మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ పెడుతున్న వ్యయం 40.9 శాతంతో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉంది. ఉత్తరప్రదేశ్ 24.8 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉంది.
100 శాతం కుటుంబాలకు కుళాయి నీటిని అందించడంలో తెలంగాణ సాధించిన విజయాన్ని ఆర్థిక సర్వే నివేదిక గుర్తించింది. తెలంగాణతో పాటు, గోవా, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలు హర్ ఘర్ జల్ మిషన్ లో వంద శాతం విజయం సాధించాయి.
భారతదేశం మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (FLFPR)లో 9.5 శాతం పాయింట్ల పెరుగుదలను సాధించింది. నాగాలాండ్ 30 శాతం పాయింట్లతో అత్యధిక FLFPRను కలిగి ఉండగా, జార్ఖండ్, సిక్కిం 25 , త్రిపుర, గుజరాత్‌లు 17, తెలంగాణ 15 శాతం పాయింట్లను కలిగి ఉంది.మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది.