విద్యార్థినులకు హెల్త్‌కిట్ల కోసం నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

బాలికలకు కౌమార ఆరోగ్య కిట్‌ల సేకరణ, పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 69.52 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధుల‌ ద్వారా మొత్తం 11 లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుంది.

Advertisement
Update:2022-11-18 17:47 IST

ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ 2వ సంవత్సరం చదువుతున్న బాలికలకు కౌమార ఆరోగ్య కిట్‌ల సేకరణ, పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.69.52 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.

దీని ప్రకారం మొత్తం 33 లక్షల శానిటరీ హెల్త్ అండ్ హైజీన్ కిట్‌లను బాలికలకు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం వల్ల 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు ఉన్న 11 లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఆరు నెలలకు, బాలికలకు పంపిణీ చేయడానికి జిప్పర్ బ్యాగ్, శానిటరీ నాప్‌కిన్లు (6 ప్యాక్‌లు), వాటర్ బాటిల్‌తో కూడిన మొత్తం 11 లక్షల కిట్‌లను సేకరించాల్సి ఉంది. వచ్చే ఏడాది అంటే 2023-24లో 22 లక్షల కిట్‌లను కొనుగోలు చేయనున్నారు.

ఈ కిట్‌ల కోసం ఖర్చును జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధుల నుండి భరిస్తామని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, మిషన్ డైరెక్టర్ (ఎన్‌హెచ్‌ఎం) ను కోరింది.

ఈ కాన్సెప్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. తదనుగుణంగా అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News