ములుగు ట్రైబల్ యూనివర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్
ములుగు సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్ నియమితులయ్యారు;
సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయ తొలి ఉపకులపతిగా ప్రొ. యడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నియమించింది. సెంట్రల్ యూనివర్సిటీకి పస్ట్ వైస్ ఛాన్స్‌లర్ ఎంపికైన ఆయన ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. 30 ఏళ్లకుపైగా ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఉస్మానియా యూనివర్సిటీలోని పలు విభాగాల్లో ఆయన సేవలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అరోరా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. దీనికి సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీగా నామకరణం చేసింది.
2024 మార్చిలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాత్కాలిక భవనాలలో యూనివర్సిటీని ప్రారంభించారు. రూ.889 కోట్లతో యూనివర్సిటీ నిర్మాణం తలపెట్టి.. కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రారంభించారు. త్వరలోనే పూర్తిస్థాయి భవనాలను అందుబాటులోకి తెచ్చి, తాత్కాలిక భవనాల నుంచి శాశ్వత భవనాలలో తరగతులు నిర్వహించేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వీసీగా నియమించినందుకు ప్రధాని మోదీకి కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు.