మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది.;
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శాసనసభాపక్షసమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు సందర్బంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీబాస్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ సమయంలో బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరు అవుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే.. ఈ అసెంబ్లీ సమావేశలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది