ఫిబ్రవరి 4న తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు

ఈ సమావేశంలో బీసీ సబ్‌ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదికపై చర్చ;

Advertisement
Update:2025-02-02 23:10 IST
ఫిబ్రవరి 4న తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు
  • whatsapp icon

ఫిబ్రవరి 4న తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల ముందు .. ఉదయం 10 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో బీసీ సబ్‌ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదికను కేబినెట్‌కు అందజేస్తారు. కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్‌ సమావేశం అనంతరం 11 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమౌతాయి. శాసనమండలి, శాసనసభలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు. 

Tags:    
Advertisement

Similar News