శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు షురూ

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ బృందం సిట్ దర్యాప్తును ప్రారంభించింది.

Advertisement
Update:2024-11-22 20:46 IST

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ బృందం సిట్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం సిట్‌ సభ్యులు తిరుమలకి చేరుకున్నారు .గత టీటీడీ పాలకులు లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఏపీ ప్రభుత్వం ఆరోపించడంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నశ్రీవారి వారి భక్తులు ఆందోళనకు గురయ్యారు.ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో కోర్టు స్పందించి సీబీఐ డైరెక్టర్‌ నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో డీఎస్పీలు సీతారామాంజనేయులు, శివనారాయణ, కృష్ణమోహన్‌, వెంకట్రామయ్య ఉన్నారు. సిట్‌ నాలుగు బృందాలుగా ఏర్పడి తిరుపతి, తిరుమల ఏఆర్‌ డైరీలలో విచారణ చేయనున్నారు.నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడులోని ఏఆర్‌ డైయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టనుంది.

మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది. లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించి సమాచారాన్ని సేకరించనున్నారు. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తును తిరుపతి నుంచి చేపట్టేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోనుంది. ఈ మేరకు అవసరమైన అతిథిగృహాన్ని కేటాయించాల్సిందిగా టీటీడీని కోరిన సీబీఐ అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో కార్యకలాపాలు సాగించేందుకు అనువైన ప్రాంతంగా భావిస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడినట్లు ఎన్డీడీబీ కాఫ్ నివేదిక లో పొందుపర్చిన అంశాలు, కల్తీ నెయ్యిలో పంది, గొడ్డు కొవ్వుతోపాటు చేప నూనె ఉన్నట్లుగా పరీక్ష నివేదికలో పొందుపరచిన ఆధారాలను పరిగణలోకి తీసుకోనుంది

Tags:    
Advertisement

Similar News