మణిపుర్‌లో బీజేపీకి షాక్.. ఎన్సీపీ మద్దతు ఉపసంహరణ

మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్ పార్టీ నేతలు తెలిపారు.

Advertisement
Update:2024-11-17 20:20 IST

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో కీలక పరిమాణం చోటుచేసుకుంది. మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు.ఈ క్రమంలో మణిపూర్ అంశంపై కేంద్ర హొం శాఖ సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ఉన్నతాధికారులతో చర్చలు జరపనుంది. 60 స్ధానాలున్న మణిపూర్‌లో బీజేపీకి 32, ఎన్సీపీకి 7 సీట్లు ఉన్నాయి. మొత్తంగా ఎన్డీయేలోని పార్టీలకు 53 స్థానాలకు పడిపోతుంది.

ఎన్సీపీ సపోర్ట్ ఉపసంహరించుకోవడంతో బలం 46 స్థానాలకు పడిపోతుంది. ప్రభుత్వానికి ఏమి డోకా లేదు.ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మళ్లీ నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై కేంద్ర హోంశాఖ అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన అమిత్​ షా మణిపుర్‌లో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని దిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్‌ షా సమావేశాన్ని నిర్వహించారు.

Tags:    
Advertisement

Similar News