రేపటి నుంచి మూడు రాష్ట్రాలో మోడీ పర్యటన

మధ్యప్రదేశ్‌, బీహార్‌, అసోంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోడీ

Advertisement
Update:2025-02-22 20:32 IST

ప్రధాని నరేంద్రమోడీ రేపటి నుంచి మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌, బీహార్‌, అసోంలో పర్యటించనున్నారు. భోపాల్‌లో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరుకావడంతో పాటు బాగల్‌పూర్‌ రైతు సమ్మాన్‌ 19 విడుత నిధుల విడుదల సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యప్రదేశ్‌లోని చతార్‌పూర్‌లో బాగేశ్వర్‌ ధామ్‌ మెడికల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్‌కు భూమి పూజ చేయనున్నారు. సోమవారం భోపాల్‌ పెట్టుబడుల సదస్సును ప్రధాని మోడీ ప్రారంభిస్తారని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. బీహార్‌ బాగల్పూర్‌ లో ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ 19 విడుత నిధులను విడుదల చేయడంతో పాటు అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అసోంకు పయనం కానున్న ప్రధాని అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం గుహవాటిలో జరిగే పెట్టుబడుల సదస్సును ప్రారంభిస్తారు.

Tags:    
Advertisement

Similar News