హాథ్రస్ 121 మంది మృతి ఘటన.. భోలే బాబాకు క్లీన్ చిట్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనతో భోలే బాబాకు సంబంధం లేదని జుడిషియల్ క్లీన్ చీట్ ఇచ్చింది.
యూపీలో 121 మంది మృతికి దారితీసిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో భోలే బాబాకు జుడిషియల్ క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ ఘటనలో బోలే బాబాకు ప్రమేయమేమి లేదని స్పష్టం చేసింది.ఈ ఘటనకు బాధ్యులు కార్యక్రమ నిర్వాహకులేనని జ్యూడిషియల్ కమిషన్ తెలిపింది. ఇక అదే సమయంలో ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు పలు కీలక సూచనలు సైతం జ్యూడిషియల్ కమిషన్ చేసింది.
2024, జులై 2వ తేదీన సికంద్రారావులోని ఫుల్లెరాయ్ మొఘట్ గఢి గ్రామంలో నారాయణ్ సకారి హరి బోలే బాబా అలియాస్ సురజ్‌పాల్ సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన వెళ్లిపోయే సమయంలో.. బోలే బాబా పాద దూళిని కోసం జనం ఒక్కసారగా పరుగెత్తారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 121 మంది మరణించారు. ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు.