రాష్ట్రపతి ముర్ముతో నూతన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ భేటీ
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Advertisement
దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై రాష్ట్రపతితో సీఈసీ చర్చించారు. గత ఏడాది మార్చిలో జ్ఞానేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. రాజీవ్ కుమార్ పదవి విరమణ పొందటంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జ్ఞానేశ్ కుమార్ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేసింది. తర్వాత కొన్ని గంటల్లోనే సీఈసీగా జ్ఞానేశ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 వరకు సీఈసీ పదవిలో కొనసానున్నారు.
Advertisement