తెలంగాణలో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు : సీఎస్
తెలంగాణలో తొలి విడతలో 231 ఎకరాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు.
Advertisement
తెలంగాణలో తొలి విడతలో 231 ఎకరాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మరో 6 నెలల్లో ఆలయ భూముల్లో వీటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. సౌర విద్యుత్ ప్లాంట్లు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
మహిళా సంఘాలకు ఆర్టీసీకి 150 ఎలక్ట్రిక్ బస్సులు తీసురానున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మాదాపూర్ ఇందిరా మహిళా శక్తి బజార్‌లో జనవరి 25లోపు ‘సరస్ మేళా’ ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ తెలిపారు.
Advertisement