డిసెంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక : మంత్రి పొంగులేటి

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎల్లుండి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement
Update:2024-12-04 17:02 IST

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒక్కో ఇంటికి రూ. 5లక్షల ఆర్ధిక సాయం 4 దశల్లో నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని మంత్రి తెలిపారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని పొంగులేటి తెలిపారు. మొదటి విడతల్లో స్వంత స్ధలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్‌ యాప్‌ సిద్ధమైంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ పూర్తయ్యే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. గ్రామీణులను దృష్టిలో పెట్టుకుని యాప్‌లో తెలుగు వెర్షన్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News