డిసెంబర్‌ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు : మంత్రి పొంగులేటి

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని అన్నారు

Advertisement
Update:2024-11-02 18:32 IST

తెలంగాణలో డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు.. సంక్రాంతి కల్లా ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని వచ్చే సంక్రాతి నాటికి నూతన పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరుతాయని అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి.. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నాలుగేండ్ల ఒక నెల పీరియడ్ ఉందని అప్పటి వరుక సీఎంగా రేవంత్ రెడ్డినే కొనసాగుతారన్నారు. కాంగ్రెస్ రెండవ సారి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షాలు అబద్దాలు మాట్లాడుతున్నారని పొంగులేటి విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News