సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశం..ఎన్నికోట్ల మంది దర్శించుకున్నారంటే..
మేడారం మహా జాతర గ్రాండ్ సక్సెస్ అయింది.
మేడారం మహా జాతర గ్రాండ్ సక్సెస్ అయింది. సమ్మక్క, సారలమ్మలు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోయారు. 4 రోజుల్లో దాదాపు కోటి 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర ముగియడంతో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. తక్కువ సమయంలోనే జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
జాతరకోసం 10వేలకు పైగా బస్ ట్రిప్పులు నడిపామన్నారు సీతక్క. గుండె సమస్యతో వృద్ధురాలు, మరో యువతి జాతరలో చనిపోయారన్నారు. మద్యం సేవించి జంపన్న వాగులో పడి మరో వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. చిన్న చిన్న ఘటనలు మినహా జాతర విజయవంతమైందన్నారు సీతక్క.
వనప్రవేశం పూర్తయి తర్వాత కూడా భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పారు సీతక్క. రేపటి వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. 4వేల మంది పారిశుధ్య సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు. జాతరకు నిధులిచ్చిన ప్రభుత్వానికి, సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క.