మోదీ నమ్మిన జ్యోతిష్యుడు.. కేసీఆర్ కే జై కొట్టాడు

రుద్రకరణ్ కి ఉన్న 34,800 మంది ఫాలోవర్లలో మోదీ కూడా ఒకరు. అలాంటి రుద్రకరణ్.. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ విజయాన్ని ఖాయం చేశారు.

Advertisement
Update:2023-05-29 16:41 IST

మోదీ నమ్మిన జ్యోతిష్యుడు.. కేసీఆర్ కే జై కొట్టాడు

మన గెలుపుపై మనకు ధీమా ఉండటం గొప్పేం కాదు, కానీ ప్రత్యర్థి వర్గం మన గెలుపుని అంచనా వేసి చెప్పడం గొప్ప మజా ఇస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇదే. అవును, ఈ ఏడాది జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని బీజేపీ అంచనా వేసింది. కేసీఆర్ మళ్లీ గద్దెనెక్కడం ఖాయమని తీర్మానించింది. బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే. కానీ మాదే విజయం అని చంకలు గుద్దుకుంటున్న తెలంగాణ కమలదళం కాస్తా ఇప్పుడు కమిలిపోయింది. బండి బ్యాచ్ కి ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాయం చేయాల్సిన పరిస్థితి రావడం విశేషం.

ఎవరు చెప్పారు..? ఏం చెప్పారు..?

తెలంగాణలో బీజేపీదే విజయం అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు రుద్రకరణ్ ప్రతాప్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణలో ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని రుద్రకరణ్ ట్వీట్ చేశారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ దే విజయం అని ఖరాఖండిగా చెప్పేశారు. రుద్రకరణ్ చెప్పారంటే అది బీజేపీ నమ్మినట్టే లెక్క. ఎందుకంటే ఆయనపై బీజేపీకి అంత గురి ఉంది. ఆయన చెప్పారంటే జరిగి తీరుతుందననే నమ్మకం బీజేపీ నాయకుల్లో ఉంది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా రుద్రకరణ్ ని బలంగా నమ్ముతారు, ఆయన ట్విట్టర్ అకౌంట్ ని ఫాలో అవుతారు.


ఎవరీ రుద్రకరణ్..

ఈ రుద్రకరణ్ ఎవరు..? ఈయన చెబితే నిజంగా జరుగుతుందా..? ఇప్పటి వరకూ చాలానే జరిగాయి మరి. 2022లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తాయని ముందే చెప్పారు రుద్రకరణ్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా సరిగ్గా అంచనా వేయగలిగారు. ప్రధాని మోదీ ఫాలో అవుతున్న ఏకైక జ్యోతిష్యుడు కూడా ఇతనే కావడం విశేషం. అంటే మోదీకి కూడా రుద్రకరణ్ అంటే అంత గురి. మోదీ నమ్మిన జ్యోతిష్యుడే బీఆర్ఎస్ విజయం ఖాయమన్నాడు, అంటే ఎన్నికల ముందే తెలంగాణ బీజేపీ అస్త్ర సన్యాసం చేయాల్సిందే.

రుద్రకరణ్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్లో అలజడి మొదలైంది. రుద్రకరణ్ లాంటి జ్యోతిష్యులకు ముఖస్తుతి చేసి మూటలందుకోవాల్సిన అవసరం లేదు. ఆహా ఓహో అంటూ బాకాలూదే భజనపరుడు కూడా ఆయన కాదు. అందుకే ఆయన్ను ప్రధాని మోదీ ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. రుద్రకరణ్ కి ఉన్న 34,800 మంది ఫాలోవర్లలో మోదీ కూడా ఒకరు. అలాంటి రుద్రకరణ్.. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ విజయాన్ని ఖాయం చేశారు. అందుకే అందరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News