అయ్యప్ప భక్తులకు శుభవార్త..తెలుగు రాష్ట్రాల నుంచి 8 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Advertisement
Update:2024-11-15 16:07 IST

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులను కోరింది తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి(హైదరాబాద్‌)-కొల్లాం, ఈనెల 24, డిసెంబర్‌ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి, నవంబర్‌ 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం, నవంబర్‌ 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

మరోవైపు రైలులో సీటు లేదా బెర్త్ దక్కని ప్రయాణికులు ఆఖరి నిమిషంలో అంటే చార్ట్ తయారైన తర్వాత కూడా సీటు పొందే అవకాశం రైల్వేశాఖ కల్పిస్తోంది. ఖాళీ బెర్త్ గురించిన సమాచారాన్ని రైల్వే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో అందిస్తోంది. హాజీపూర్ రైల్వే జోన్‌లో ఈ సదుపాయం ప్రారంభమైంది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని జోన్ పరిధిలోని 5రైల్వే డివిజన్లలోనూ ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్)లో ఇస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News