మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల నియామకంపై సీఎంకు లేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుపరిపాలనా వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల నియామకంపై ఈ లేఖ రాశారు.

Advertisement
Update:2024-11-15 17:49 IST

మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల నియామకంపై సీఎం రేవంత్‌రెడ్డికి సుపరిపాలనా వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. 2016లో ఈ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు నియామకాలు జరగలేదని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు నియామకాలు జరపకపోవడంపై హైకోర్టు కూడా మందలించినట్లు తెలిపాడు. కొందరు బిల్డర్లు అక్రమ కట్టడాలను కట్టి విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలను కొని సామాన్యులు మోసపోతున్నారని తెలిపారు. అక్రమ కట్టడాల నిరోధానికే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ అన్నారు.

ఎనిమిదేళ్ల క్రితమే ఈ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు ఉండకపోయేవన్నారు. కాబట్టి, తక్షణమే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యులను నియమించాలని ఆ లేఖలో కోరారు. 8 ఏళ్ల క్రితమే ట్రైబ్యునల్‌లో నియామకాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ స్థాయిలో నిర్మాణాలు వెలిసేవి కావన్నారు. తక్షణమే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఛైర్మన్, సభ్యులను నియమించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి రాసిన లేఖలో పద్మనాభరెడ్డి కోరారు.

Tags:    
Advertisement

Similar News