హైదరాబాద్‌లో సింగర్ దల్జీత్ మ్యూజిక్ కచేరీపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు
ప్రముఖ గాయకుడు, నటుడు దల్జీజ్ దోసాంజ్ నేటి మ్యూజిక్ కచేరీపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
పంజాబీ స్టార్ సింగర్ దిల్జీత్ దోసాంజే హైదరాబాద్‌లో నిర్వహించే మ్యూజిక్ కచేరీపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఎలాంటి పాటలు ఆలపించవద్దని నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం అందులో భాగంగానే ఈ ఆదేశాలు జారీచేసింది. దోసాంజ్ మ్యూజిక్ కన్సర్ట్‌లో వీటిపై పాటలు సర్వసాధారణం కావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దోసాంజ్ గతంలో డ్రగ్స్, మద్యంపై పాడిన పాటల వీడియో సాక్ష్యాలను చండీగఢ్‌కు చెందిన పండిట్‌రావ్ ధరేన్వర్ సమర్పించిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. దిల్జిత్ దోసాంజ్‌కి మాత్రమే కాకుండా ఆయన కాన్‌సర్ట్‌ను హోస్ట్ చేస్తున్న నోవోటెల్ హోటల్‌కు ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే, నవంబర్ 15న నిర్వహిస్తున్న ఈ కాన్‌సర్ట్ కోసం దిల్జిత్ ముందుగానే హైదరాబాద్ చేరుకున్నారు. చార్ మినార్ దగ్గర తిరిగి.. ఆటోలో తిరుగుతూ సరదాగా గడిపారు. ఈ మొత్తాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కాగా.. ప్రస్తుతం దిల్జిత్ దోసాంజ్ తన వరల్డ్ టూర్ కాన్‌సర్ట్‌లో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే జైపూర్, ఢిల్లీలో కాన్‌సర్ట్స్ నిర్వహించిన దిల్జిత్.. యూకేలో కూడా ఓ కాన్‌సర్ట్ నిర్వహించాడు.దల్జీత్ దోసాంజ్ దిల్ లుమినటి టూర్ దేశవ్యాప్తంగా 11 నగరాల్లో గత నెల 26న ప్రారంభమైంది. అందులో భాగంగా నేడు హైదరాబాద్‌లో మూడో షో నిర్వహించనున్నాడు. ఈ కచేరీకి సంబంధించి టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి.