ఫుడ్ పాయిజన్ కుట్రల వెనుక ఆర్‌ఎస్పీ : కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. గురుకులాల్లో కుట్రల వెనుక బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ హస్తం ఉందన్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకుల హాస్టళ్లలో వరుస కలుషిత ఆహారం ఘటనల వెనుక బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారు. తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారు’’ అని కొండా సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫుడ్ పాయిజన్‌తో ఒకే విద్యార్ధిని మృతి చెందిందని దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి అన్నారు.
సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి అన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవి. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా భారాస ప్రభుత్వం పట్టించుకోలేదు.