దయచేసి నన్ను నమ్మండి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశానని అన్నారు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌. చట్టసభల్లో పేదల గొంతుకగా ఉండాలనే లక్ష్యంతోనే విలువైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

Advertisement
Update:2024-03-22 19:56 IST

బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నాగర్ కర్నూలు లోక్ సభ సీటు ఖరారు చేశారు కేసీఆర్. ఈ నేపథ్యంలో RSP కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పరిస్థితుల్లో పార్టీ మారవలసి వచ్చిందో వివరించారు. ఒక ఉన్నత లక్ష్యంకోసం తాను ప్రయత్నిస్తున్నానని, తనకు అందరి అండదండలు కావాలని కోరారు. తనని అర్థం చేసుకోవాలన్నారు. లోక్ సభ పోరులో కేసీఆర్‌ మార్గదర్శనంలో విజయం కోసం పోరాడతానని అన్నారు. "నేను చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ అక్కడ కూర్చున్నట్టే"నన్నారు. "నేను నేను కాదు.. నేను మీరే" అని తెలిపారు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్. బడుగు బలహీన వర్గాల ప్రజలంతా నాగర్ కర్నూలులో తన విజయానికి కృషి చేయాలన్నారు.

RSP ఆవేదన..

పార్టీ మారిన విషయంలో తనను అర్థం చేసుకోకుండా.. సోషల్‌మీడియా వేదికగా కొన్ని శక్తులు తీవ్రమైన దాడి చేశాయని, కొంతమంది ఆప్తులు కూడా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలాంటి అనాగరికమైన దాడులు తనకు కొత్త కాదని అంటున్న ఆయన.. పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న తన లక్ష్యం ముందు చిల్లర రాజకీయాలు పనిచేయవన్నారు. తన మీద నమ్మకంతో నాగర్‌కర్నూలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

నమ్మండి ప్లీజ్..

ఇన్నాళ్లూ పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశానని అన్నారు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌. చట్టసభల్లో పేదల గొంతుకగా ఉండాలనే లక్ష్యంతోనే విలువైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అసెంబ్లీ పోరాటంలో విఫలమయ్యానని చెప్పుకొచ్చారు. ఎంతో శ్రమించి బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు కుదిర్చానని, అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో రద్దయిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాను కేసీఆర్ తో ప్రయాణం మొదలు పెట్టానన్నారు RSP. బీజేపీ కుట్రల నుంచే దేశాన్ని రక్షించే దమ్ము-ధైర్యం కాంగ్రెస్‌కు లేవని, అందుకే తాను బీఆర్‌ఎస్‌లో చేరానని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News