గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న రేవంత్‌ సర్కార్‌

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తునన్నదని మెదక్‌ ఎంపీ ఫైర్‌

Advertisement
Update:2024-10-30 13:45 IST

గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 1200 కోట్లు విడుదల చేస్తే రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగిలిన రూ. 1000 కోట్లను రేవంత్‌ ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు దారి మళ్లించిందని ఆరోపించారు. ఆరు నెలలైనా కేంద్రానికి పంపాల్సిన యూసీలు పంపకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ. 600 కోట్ల నిధులు ఆగిపోయాయి. దీనివల్ల గ్రామాల్లో కొత్తగా కట్టాల్సిన డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కల్లాలు.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సంక్షేమం కోసం జరగాల్సిన పనులన్నీ కూడా రేవంత్‌ సర్కార్‌ నిధుల మళ్లింపు వల్ల ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రమ పద్ధతి ప్రకారం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారని ధ్వజమెత్తారు.

గ్రామ పంచాయతీల్లో కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదన్నారు. పల్లె ప్రగతి విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శలు సొంతంగా డీజిల్‌, సానిటైజేషన్‌ కోసం రూ 3-5 లక్షలు ఖర్చు పెట్టారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కడికి పోతున్నాయి? అని నిలదీశారు. 

Tags:    
Advertisement

Similar News