సీఎం అయ్యాక రేవంత్‌కు 3 వరుస దెబ్బలు..
సీఎం కాకముందు 2019ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్‌గిరి స్థానంలోనూ ఏరికోరి తెచ్చిపెట్టిన సునీతామహేందర్‌రెడ్డి ఓటమి రేవంత్‌కు నిరాశనే మిగిల్చింది.
సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో రెండు వరుస ఓటములు సీఎం రేవంత్‌రెడ్డిని షాక్‌కు గురిచేశాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి మరువక ముందే మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఓటమి రేవంత్ రెడ్డికి మింగుపడని పరిణామమే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో తగినంత బలంలేక ఓడామని సరిపెట్టుకున్నా.. మహబూబ్‌నగర్ ఎంపీ సీటు కోల్పోవడం మాత్రం పరాభవమే. అందరి కంటే ముందుగానే వంశీచంద్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి, సీఎం రేవంత్‌రెడ్డే అన్ని తానై వ్యవహరించినా ఫలితం దక్కలేదు.
ఇది చాలదన్నట్లు సీఎం కాకముందు 2019ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్‌గిరి స్థానంలోనూ ఏరికోరి తెచ్చిపెట్టిన సునీతామహేందర్‌రెడ్డి ఓటమి రేవంత్‌కు నిరాశనే మిగిల్చింది. అలాగే రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్ కనీసం 12నుంచి 14 స్థానాల్లో గెలుస్తుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కానీ, అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.