గ్రూప్‌ - 1పై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

కొత్తగా పర్మిషన్ ఇచ్చిన 60 పోస్టుల్లో 24 డీఎస్పీ పోస్టులు, 19 MDO పోస్టులు, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో 4, ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో 3 డిప్యూటీ కలెక్టర్, పంచాయతీ రాజ్‌లో డిస్ట్రిక్ పంచాయతీ రాజ్ పోస్టులు -2 ఉన్నాయి.

Advertisement
Update:2024-02-06 16:39 IST

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ - 1 కేటగిరిలో మరో 60 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే TSPSC 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా మరో 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి పెరిగింది.

కొత్తగా పర్మిషన్ ఇచ్చిన 60 పోస్టుల్లో 24 డీఎస్పీ పోస్టులు, 19 MDO పోస్టులు, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో 4, ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో 3 డిప్యూటీ కలెక్టర్, పంచాయతీ రాజ్‌లో డిస్ట్రిక్ పంచాయతీ రాజ్ పోస్టులు -2 ఉన్నాయి. ఇక ఈ పోస్టుల భర్తీ కోసం వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని TSPSCకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని TSPSC ఏర్పాట్లు చేసింది. గతేడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా.. దాదాపు 2.32లక్షల మంది హాజరయ్యారు. పేపర్‌ లీకేజీ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండు సార్లు ఈ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News