ఆయిల్‌ మసాజ్‌తో రిలాక్స్‌

పాదాలకు నూనెతో మసాజ్‌ చేయడం వల్ల రోజంతా అలసిపోయిన శరీరం కొత్త శక్తిని పొందుతుంది అంటున్న నిపుణులు

Advertisement
Update:2024-12-07 17:00 IST

ఆయిల్‌ మసాజ్‌ ఒత్తిడిని దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. రోజు పడుకునే ముందు పాదాలకు నూనెతో మర్దనా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పాదాలకు నూనెతో మసాజ్‌ చేయడం వల్ల రోజంతా అలసిపోయిన శరీరం కొత్త శక్తిని పొందుతుంది. మరుసటిరోజు ఉత్సాహంగా పని చేయడానకి సాయపడుతుంది. రెగ్యులర్‌గా పాదాలకు మర్దనా చేయడం వల్ల వాతకఫ దోషాలు క్రమంగా అదుపులోకి వస్తాయి. ఫుట్‌ మసాజ్‌ శరీరానికి రిలాక్స ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి గాఢ నిద్ర వచ్చేలా చేస్తుంది. రోజూ పాదాలకు నూనెతో మసాజ్‌ చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది. పడుకునే ముందు పాదాలకు నూనె రాయడం వల్ల పాదాలు తేమను సంతరించుకుని మృదువుగా మారుతాయి. పగుళ్లు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి తగ్గుతుంది. ఒత్తిడికి గురైన కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పాదాలు మసాజ్‌ చేయడానికి నువ్వులు, కొబ్బరి నూనె, ఆవాల నూనె, బాదం లావెండర్‌ ఆయిల్స్‌ వాడితే మంచిదని సూచిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News