ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్‌ ఆస్పత్రి

క్యాన్సర్‌ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారన్న బాలకృష్ణ

Advertisement
Update:2025-02-15 09:57 IST

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని మరింత విస్తరించనున్నామని ఆస్పత్రి ఛైర్మన్‌ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లోని క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్‌ణు ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. నేడు పీడియాట్రిక్‌ వార్డు, పీడియాట్రిక్‌ ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్‌ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News