అరటి పండుతో అనేక ప్రయోజనాలు
పుష్కలంగా పోషకాలు ఉండే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Advertisement
అరటిపండులో పోషకాలు మెండుగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చిన్నవాళ్ల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు ఆహారంలో భాగంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. బాగా పండిన అరటి పండులో మన శరీరానికి లాభం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండులో అధికంగా ఉండే ఫ్రక్టోజ్ మన శరీరంలోకి వెళ్లాక గ్లూకోజ్‌గా మారి శక్తిని అందిస్తుంది.సహజసిద్ధంగా పండిన అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే తేలికగా జీర్ణమవడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చిన్నపిల్లలకు ఆహారాన్ని అలవాటు చేయడానికి అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుందని చెబుతున్నారు.
Advertisement